శ్రీశైలం: వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆత్మకూరు పట్టణంలో రెండవ రోజు ముస్లింల ప్రార్థనలు
ఆత్మకూరు పట్టణంలో ముస్లిం సోదరులు సంవృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పట్టణంలోని కబరస్థాన్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక దువా (ప్రార్థన)లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని అల్లాహ్‌ను వేడుకున్నారు. రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, భూగర్భ జలాలు పెరగాలని, తాగునీటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించారు.అలాగే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న పశు పక్షాదులు ఇతర జీవరాశులకు కూడా ఉపశమనం కలగాలని, ప్రకృతి సమతుల్యత నెలకొని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేకంగా దువా చేశారు.