శ్రీశైలం: శ్రీశైలంలో రేపు భ్రమరాంబ దేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవ ఏర్పాట్లను ఘనంగా చేస్తున్న అధికారులు
శ్రీశైలం మహాక్షేత్రంలో రేపు 7 భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది ఈనేపథ్యంలో అమ్మవారి ఆలయంలో నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు,చండీహోమాన్ని కుంభోత్సవం రోజున నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఉత్సవ సంబంధిత పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించనున్నారు అయితే కుంభోత్సవం రోజున సాయంత్రం వేడుక తరువాత భక్తులను అనుమతి ఇస్తామన్నారు అమ్మవారికి సాత్విక బలి కోసం వేలాదిగా గుమ్మడికాయలని,నిమ్మకాయలను, టెంకాయలను, రాసులుగా పోసి ఉంచారు.