అనంతపురం జిల్లా కేంద్రంలో సిఐటియు కార్యాలయం నందు ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్.వి నాయుడు రాప్తాడు సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్.వి నాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునర్ ప్రారంభించి నాలుగు పథకాలు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నామని మిగిలిన అన్ని పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించాలని లేకుంటే ప్రభుత్వంపై పోరాటాలు చేయాల్సి వస్తుందని సిఐటియు అధ్యక్షుడు ఆర్.బి నాయుడు, కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.