శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శించుకున్న తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శనం చేశారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. తరువాత స్వామి, అమ్మవారిని దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు.