మహబూబాబాద్: గార్ల మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో లో నిలిచిపోయిన మురుగు నీరు వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉన్న గోదాము వద్ద నిలిచిన మురుగునీటి వల్ల హాస్టల్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థినిలు ఆదివారం సాయంత్రం 5:00 లక్కు తెలిపారు..గోదాము ప్రహరీ పక్కన ఉన్న మురుగునీటి గుంట, తుమ్మ చెట్ల మధ్య వర్షపు నీరు నిలిచిపోయి దోమల వ్యాప్తికి కారణమవుతోందన్నారు..దీంతో విద్యార్థులు, కాలనీవాసులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.