20 శాతం తేమ ఉన్న పత్తికి మద్దతు ధర కల్పించాలని వాంకిడి మండల తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి పగ్గు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులు వేసిన పత్తి పంట మొంథా తుపాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో పంట వరద పాలవ్వడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చాలా పంటలు నీట మునిగాయన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.