బోధన్: ఏరాజ్ పల్లి గ్రామ శివారులో చెరువులో పడి వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఎరాజ్పల్లి గ్రామానికి చెందిన మల్లారం సాయిలు (44) అనే కూలీ ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి మంగళవారం వరకు తిరిగి రాలేదు. మంగళవారం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.