చౌడుపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట కోత ప్రయోగం నిర్వహణ: చింతపల్లి మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు
చింతపల్లి మండలంలోని చౌడుపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం మొక్కజొన్న పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి మధుసూధనరావు తెలిపారు. సీసీ ప్లాట్ విజిట్ ఎన్ఎస్ఓ సూపర్వైజర్, సీనియర్ స్టాటికల్ అధికారి డేవిడ్ రాజు, ఏఎస్ఓ రాంబాబు, రైతు వెంకటరమణ తదితరులతో కలిసి 5×5 విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం నిర్వహించగా, 26.05 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. దీంతో ఎకరానికి సుమారు 4,220 కిలోల దిగుబడి వస్తుందని గుర్తించామన్నారు.