ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం ముట్టడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యత్నం. పరిస్థితి ఉద్రేకత
శ్రీశైలం నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.ఇటీవల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యత్నించారు.అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి కార్యకర్తలను అడ్డుకున్నారు.