శ్రీశైలం: బక్రీద్ పండగ సందర్భంగా గోవధ, గోవుల అక్రమ రవాణా అరికట్టాలని సీఐ కి వినతి పత్రం ఇచ్చిన వెలుగోడు బిజెపి నాయకులు
ఈరోజు వెలుగోడు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో వెలుగోడు మండల BJP అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్ రెడ్డి మరియు వెలుగోడు ఎస్ఐ సురేష్‌ను కలిసి గోవధ నిషేధం, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.బక్రీదు పండుగను పురస్కరించుకుని వెలుగోడు మండలంలో గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని, గోవులను రక్షించాలని వారు అధికారులను కోరారు. మండలంలో గోవుల అక్రమ రవాణా కొనసాగుతోందని, వాటిని వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బక్రీదు పండుగ వరకు గోవులను కొనుగోలు, అమ్మకాలు జరగకుండా ఆవుల మంద యజమానులకు సూచనలు ఇవ్వాలని కోరారు.