సంగారెడ్డి: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం తార్దాన్ పల్లి ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రంను సుల్తాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి ఉన్నత పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఉత్తమ ఫలితాల సాధనకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పాండు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.