ఆళ్లగడ్డ మండల కేంద్రంలో లింగమయ్య వీధిలో భారీ గొయ్యి ,పొంచి ఉన్న ప్రమాదం
ఆదిమరిస్తే గోతిలో పడడం ఖాయం ఆళ్లగడ్డలోని లింగమయ్య వీధిలోని 4 రోడ్ల కూడలి వద్ద భారీ గొయ్యి వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రోడ్డు దాటే క్రమంలో, రాత్రి వేళలో వాహనదారులు, ప్రజలు కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ గొయ్యిని పూడ్చలేదని ఆరోపిస్తున్నారు.