మహబూబాబాద్: మెడికల్ కాలేజీకి మరో మృతదేహం అప్పగింత
మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి మోత్కూరు పరమేశ్వర్ మృతదేహాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అప్పగించారు. గత నెల రోజుల్లోనే మూడు మృతదేహాలను దానం చేయించినట్లు లయన్స్ క్లబ్ నిర్వాహకులు వెల్లడించారు. వైద్య విద్యార్థుల కోసం మృతదేహాల అవసరం ఉందని, దాతలు ముందుకు రావాలని కోరారు.