స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లో భాగంగా హిందూపురం నియోజకవర్గం అన్ని మండలాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ
CM చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అందులో భాగంగా హిందూపురం పట్టణంలో శ్రీకంఠాపురం, లక్ష్మీపురం, మోడల్ కాలనీ కంసల పేట మరియు ధర్మపురం నందు ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొని రావడానికి చాలా సులువుగా ఉంటుందని, స్మార్ట్ రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ ఉండడం వలన ఎటువంటి మోసాలు చేసే అవకాశం లేదని, ఈ కార్డుని జాగ్రతగా పెట్టుకోవాలని తెలియజేశారు