చింతలపూడి: చింతలపూడిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గురవాయిగూడెం సర్పంచ్, కార్యకర్తలు
చింతలపూడి నియోజకవర్గం, గురవాయిగూడెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే పనితీరుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.