ఏపీ మైనార్టీ కమిషన్ డైరెక్టర్గా హిందూపురం RMS షఫీ
ఏపీ సగర కార్పొరేషన్ డైరెక్టర్ గా హిందూపురం మణి ప్రియ ఎంపిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ డైరెక్టర్ల జాబితాలో హిందూపురానికి రెండు స్థానాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ సగర కార్పొరేషన్ డైరెక్టర్ గా జనసేన పార్టీకి చెందిన మణి ప్రియ అనే మహిళకు స్థానం దక్కింది అలాగే ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ డైరెక్టర్ గా టీడీపీ సీనియర్ నాయకుడు RMS షఫీ ఉల్లా కు స్థానం దక్కింది. ఈ సందర్భంగా డైరెక్టర్లుగా నియమితులైన ఆర్ఎంఎస్ షఫీ మరియు మణి ప్రియ లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో టిడిపి నాయకులు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.