కొల్లాపూర్: సోమశిల కృష్ణా నది తీరాన ఘనంగా అమ్మవారి చక్రస్నానం
కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణా నది తీరాన నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. పాలెం ఫ్రెండ్స్ యూత్ క్లబ్, పద్మావతి మాతృమండలి ఆధ్వర్యంలో దీక్షా కంకణ విసర్జన మరియు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.