అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా యూనిట్-15లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రొడక్షన్ బ్లాక్లో ఐసో ప్రొఫైల్ బ్యాచ్ క్లీనింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది.