శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ ప్రదక్షిణాలు నిర్వహించి శ్రీ మల్లికార్జునస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటం, అందజేశారు