పార్వతీపురం: సాలూరులో మూడు గంటల్లోనే కోటి రూపాయల విలువైన బంగారం రికవరీ
సాలూరులో ద్విచక్ర వాహనం నుండి జారిపడిన 900 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును, ఫిర్యాదు అందిన కేవలం 3 గంటల్లోనే పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.