డోన్: బేతంచర్లలో టిడిపి ముమ్మరంగా ప్రచారం
Dhone, Nandyal | Oct 23, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీలో టీడీపీ ఛైర్మన్, వార్డు అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.పట్టణంలోని కోటపేట, చాకలిపేట తదితర ప్రాంతాల్లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి లోకేశ్ గౌడ్, 21వ వార్డు అభ్యర్థి సుబ్బమ్మ ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. టీడీపీ అభ్యర్థులను అత్య ధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేకల నాగరాజు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.