రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి ఆదేశాల మేరకు రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి అన్న సమాచారం మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శివతి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ జిల్లా అధికారులతో టెలి కౌన్సిల్ ద్వారా సమావేశం నిర్వహించి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు