ఒంగోలు అర్బన్: దళిత కాలనీల్లో వివక్షతపై పోరుకు ప్రజాసంఘాల పిలుపు..
Ongole Urban, Prakasam | Aug 2, 2026
స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఒంగోలు నగరంలోని దళిత కాలనీల్లో సామాజిక, ఆర్థిక, పౌర సదుపాయాల విషయంలో వివక్షత కొనసాగుతోందని కెవిపిఎస్, సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, ఆవాజ్ తదితర ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద, 7న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.