నిజామాబాద్ సౌత్: నగరంలో జరుగుతున్న ఆర్యవైశ్య పట్టణ సంఘ ఎన్నికల్లో గందరగోళం
నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాలకు ఆదివారం జరిగిన పోలింగ్లో గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కేంద్రం లోపల ఉన్నారని.. తమ ప్యానల్ అనుకూలంగా దగ్గరుండి ఓటేయిస్తున్నారని కొందరు ఆందోళనకు దిగారు. మాణిక్ భవన్ పాఠశాలలో మహిళ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఒక ప్యానల్కు సంబంధించిన మద్దతుదారులు వ్యవహరించిన వీడియో వైరల్ అవుతోంది.