ఇంద్రవెల్లి: కొబ్బాయిగూడలో పాము కాటుతో ఆశా వర్కర్ మృతి
పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది.మహిళ భర్త సోనే రావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొబ్బాయి గూడ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ కుమ్ర దృపత మంగళవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో రెండు గంటల సమయంలో పాము ఇంట్లోకి చొరబడి మంచం పై నిద్రపోతున్న దృపత ను కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.దృపత కు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.