ఒంగోలు అర్బన్: భారీ ర్యాలీ మానవహారంతో కదం తొక్కిన కాంట్రాక్టు ఉద్యోగులు
Ongole Urban, Prakasam | Jul 31, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్ కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు మధ్యాహ్న భోజన కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు ఫీల్డ్ అసిస్టెంట్లు వామపక్ష పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ లో గొడవ తగ్గించాలని ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ఉంచాలని డిమాండ్ చేశారు తల్లికి వందనాన్ని ఎటువంటి షరతులు లేకుండా అందజేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఈపీఎఫ్ హెల్త్ స్కీమ్ వంటివి అమలు చేయాలన్నారు.