బోధన్: బోధన్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: బోధన్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ మోహన్ రెడ్డి
బోధన్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు పంటలతో పాటు ఆస్తి నష్టం జరిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అధిక మొత్తంలో పంటలు భారీ వర్షాలకు కొట్టుకుపోయాయని, చాలా ఇల్లు కూలిపోయాయని వాటికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలోని సాలూర,రెంజల్, కందకుర్తి, నవీపేట్, తోపాటు అన్ని మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట, ఆస్తి నష్టం జరిగిందన్నారు