ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు.
Ongole Urban, Prakasam | Aug 1, 2026
తల్లి పాల వారోత్సవాలు శనివారం నెహ్రు నగర్ అంగన్వాడీ సెంటర్ UPHC వెంకటేశ్వరాకాలనీ లో కమలశ్రీ అధ్వర్యం లో మదర్స్ మీటింగ్ నిర్వహించారు. డాక్టర్ కమలశ్రీ మాట్లాడుతూ తల్లి పాల ప్రాముఖ్యత తల్లి పాల వలన బిడ్డ కు కలిగే లాభాలు తల్లి కి బిడ్డ కు మద్య అనుబంధం డబ్బా పాల వలన వచ్చు నష్టాలు బిడ్డ పుట్టగానే ఇచ్చే ముర్రుపాల వలన బిడ్డ కి ఇమ్మ్యూనిటి పెరిగి 6నెల వచ్చు వరకు బిడ్డ ఆరోగ్యం గా పెరుగుతారు.6నెలల తరువాత బిడ్డకు సెమీ శాలిడ్ పుడ్ పెట్టవచ్చని వివరించారు.ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్,,హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు