పుంగనూరు: పుంగనూరులో పెరటాసి మాసం మూడో శనివారం: కిటకిటలాడిన శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయం
పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా పుంగనూరు శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో కొలువుదీర్చి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.