సిద్దిపేట అర్బన్: రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ రిఫైనరీ ఫ్యాక్టరీ నర్మెటలో ఏర్పాటు చేయడం జరిగింది: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం నంగునూరు మండలం నర్మెట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన పనులు పూర్తయిన వెంటనే ఒక లక్ష మంది రైతులతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంటామని తెలిపారు.