గుంతకల్లు: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో వృద్ధుడు ఆత్మహత్యాయత్నం, గుత్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామానికి చెందిన తిమ్మరాజు అనే వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ గుత్తి ఆసుపత్రిలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామానికి చెందిన తిమ్మరాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యసమస్యలతో పాటుగా కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధ పడుతుండేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిమ్మరాజు జీవితం మీద విరక్తి చెంది సోమవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.