దువ్వూరు: జిల్లా వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ ఉన్న బిల్లులు చెల్లించాలి: నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ డిమాండ్
కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, అలాగే మౌలిక వసతులు కల్పించాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజికుంట నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని స్థానిక రాజుపాలెం మండల పరిధిలో ఉన్న వసతి గృహం నందు విద్యార్థులతో కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజికుంట నాగరాజు మాట్లాడారు.