మహబూబాబాద్: అసంపూర్తిగా ఉన్న కంకర బోర్డు రోడ్డుపై సిపిఐ నిరసన
మహబూబాబాద్ కంకర బోర్డు వద్ద అసంపూర్తిగా వదిలేసిన ప్రధాన రోడ్డును వెంటనే పూర్తి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పంప్ హౌస్ తొలగించి రోడ్డును వెడల్పు చేయాలని, పనులు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ డిమాండ్ చేశారు.