సంగారెడ్డి: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు : వి సి లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివే విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం హైదరాబాదు నుండి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు సంబంధిత శాఖల అధికారులతో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.