కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును వారికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. పెన్షన్లు పొందిన అలబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.