పాడేరు: పాడేరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో కనీస సౌకర్యాలు కల్పించాలి..పాడేరులో ఏఐటీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్
పాడేరులోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్ శనివారం మధ్యాహ్నం డిమాండ్ చేశారు. కోర్టుకు హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల నుంచి వయసు పైబడిన వారు, మహిళలు కోర్టు వాయిదాలకు వస్తున్నారని తెలిపారు. అయితే కోర్టు ఆవరణలో కనీసం కూర్చునే అవకాశం లేదన్నారు. తాగునీటి సౌకర్యం లేదన్నారు. మహిళలకు టాయిలెట్లు లేవన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.