బోధన్: ధర్మారంలో కోతి ఆలయ నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గ్రామస్తులు
సాధారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు జన్మదినాన్ని జరుపుకుంటారు.కానీ అక్కడ మాత్రం సాక్షాత్తు ఆంజనేయ ప్రతిరూపం అని పిలువబడే వానరానికి నిత్యం పూజలు చేస్తారు.ఇది నవిపేట్ మండలం ధర్మారం గ్రామంలో ఉంది. 49 ఏళ్ళ క్రితం గ్రామంలోని విట్టబా అనే వ్యక్తి కి కలలో కోతి దేవుడు వచ్చి తనకు ఆలయం కట్టి పూజలు చేయాలని కోరాడు. తనను ప్రార్తిస్తే కోరుకున్న కోర్కెలు తీరుస్తానని చెప్పాడు. దింతో గ్రామంలో గ్రామ పెద్దలు సహకారంతో కోతి దేవుడికి ఆలయం కట్టారు.అంతే అప్పటి నుండి ప్రతి యేడు సెప్టెంబర్ 16న గ్రామస్థులు అందరూ కోతి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఆలయ 49వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు.