జహీరాబాద్: జహీరాబాద్ లో బీసీ జేఏసీ బంద్, డిపో నుండి కదలని ఆర్టీసీ బస్సులు
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుండి బస్సులు కదలలేదు. ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో నిలిచిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు. ఇదే అదనగా భావించిన ప్రైవేటు వాహనదారులు చార్జీలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.