అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో సామాజిక సేవకురాలు హేమలత లవణం 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సంఘం కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో హేమలత లవణం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం కోశాధికారి జెన్నేకుల్లాయిబాబు మాట్లాడుతూ హేమలత లవణం వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటుపడ్డారని అన్నారు.