ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం వీరంపల్లి స్టేజ్ దగ్గర ఉన్న రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉంది.
గుంతలుగా మారిన ఆర్అండ్ రోడ్లు ఎమ్మిగనూరు: బళ్లారి-కర్నూలు రహదారి మధ్యలో ఉన్న గోనెగండ్ల మండలం వీరంపల్లి స్టేజ్ దగ్గర ఉన్న రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. కర్నూలు నుంచి పత్తికొండ, బళ్లారికి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుకు ఇరువైపుల గుంతలు ఏర్పడ్డాయని, అదుపుతప్పి కిందపడి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్&బీ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. -