కనిగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజమాదిగ ఆధ్వర్యంలో ఆదివారం మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాదిగ మాట్లాడుతూ.... ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎంతోమంది మాదిగలు ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసి అసువులు బాసరన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. మాదిగ అమరవీరుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాదిగ సోదరులు ముందుకు సాగాలని సూచించారు.