గుంతకల్లు: పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
అనంతపురం గుంతకల్లు పట్టణంలో విద్యార్థులకు మానసిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీడీఎస్ యూ నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య మొదటి బ్రాంచ్ లో విద్యార్థులను మానసికంగా వేధింపులతో పాటుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ వీరేష్ బాబు, పీఈటీ, ఉపాధ్యాయుడు రామాంజనేయులు పైన క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు.