ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో దళిత గిరిజన సమస్యలు కుప్పలు, తెప్పలుగా పేరుకొని ఉన్న పట్టించుకోని నాయకులు అధికారులు : జై భీమ్ ఎమ్మార్పీఎస్
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మిగనూరు టౌన్ లో దళిత గిరిజన సమస్యలు కుప్పలు, తెప్పలుగా పేరుకొని పోయి ఉండడంతో నేడు జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ మహిళా అధ్యక్షురాలు కదిరికోట పద్మక్క మాదిగ మరియు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షులు మడ్రి గుంటెప్ప మాదిగలు మాట్లాడుతూ..... ఎమ్మిగనూరు టౌన్ దళిత వాడల్లో సమస్యలు స్థానిక దళిత నాయకులు, అధికారులు నోరు మెదపకుండా ఈ వాడల్లో అభివృద్ధికి శూన్యం చేస్తూ, ఆధిపత్య కులాల దగ్గర దళిత నాయకులు బానిసంగా ఉంటూ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటూ ఉన్నారు.