కథలాపూర్: గండిపడ్డ చెరువుకు మరమ్మతులు చేపట్టండి:బిజెపి నేతలు
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని చెరువుకు గండి పడటంతో సుమారు 80 ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందని BJP నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు గండి పడ్డ చెరువును సందర్శించి,నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, తహశీల్దార్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చెరువుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. BJP నాయకులు మారుతి,వెంకటేశ్వరరావు,లింగం,భూమయ్య, ప్రతాప్,మహేష్,శ్రీకాంత్, మల్లేష్ పాల్గొన్నారు.