అమ్రాబాద్: అమ్రాబాద్‌లో దారుణం: భర్తను హతమార్చి పరారైన భార్య, కుమారులు
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో మొబైల్ షాప్ యజమాని ఎండి బురాన్ అనుమానాస్పద మృతి. భార్య, ఇద్దరు కుమారులే హత్య చేసి పరారైనట్లు అనుమానం. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన కుమారులు, తల్లితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.