రంపచోడవరం కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషపై ఘాటు విమర్శలు చేసిన వైసిపి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి పై ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రంపచోడవరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రంపచోడవరం కూటమి ఎమ్మెల్యే అవినీతికి విపరీతంగా పాల్పడుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని అన్నారు. అవినీతి ఎమ్మెల్యేల జాబితా తీస్తే అందులో ఐదో స్థానంలో ఉన్నారని చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో అవినీతి ఎమ్మెల్యేగా ప్రజలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. పేకాట, గుండాట, జూదాలు వంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.