భద్రాచలం: భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ గుట్టురట్టు: భారీగా నిల్వలు స్వాధీనం
భద్రాచలం అశోక్‌నగర్ కాలనీలో కల్తీ నెయ్యి తయారీపై ఆహార భద్రతా శాఖ అధికారులు దాడులు చేశారు. 30 కిలోల డాల్డా, 10 లీటర్ల నెయ్యి, పామాయిల్ మరియు వెన్నను స్వాధీనం చేసుకుని, నమూనాలను ల్యాబ్‌కు పంపారు. నిందితులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.