శ్రీశైలం: శ్రీశైలం మండలం సుండిపెంటలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే బుడ్డా
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. బస్టాండ్, రింగ్ పార్క్, వెస్ట్రన్ కాలనీలలో నిర్మించిన రోడ్లకు పూజలు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో భారీగా గ్రామ ప్రజలు, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సభలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ గృహాలకు నోటీసులు జారీ అవుతున్నాయని, అన్నారు.