పటాన్చెరు: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమూహ కార్యక్రమాలు విజయవంతం : MLA గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్లోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక ఆహార వారోత్సవాలు, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి MLA గూడెం మహిపాల్ రెడ్డి మెదక్ MP రఘునందన్ రావు, కలెక్టర్ ప్రావిణ్య, ముఖ్య అతిథులుగా హాజరై, కార్యక్రమాలను ప్రారంభించారు.