హిందూపురం నియోజకవర్గం లో యతెచ్చాగా తరలిపోతున్న కలప పట్టించుకోని అధికారులు
హిందూపురం నియోజకవర్గం లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొందరు యథేచ్ఛగా అక్రమంగా కలపను రవాణా చేస్తుస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో రోజూ ట్రాక్టర్లలో కలప అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ఏళ్లనాటి వృ క్షాలను నరికి వేసి పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. సంవత్సరాలుగా చెరువుల్లోను, గ్రామాల్లో ఉన్న తుమ్మచెట్లతో పాటు ఇతర చెట్లను నరికేస్తున్నారని ఆయా ప్రాంతాల్లో స్థానికులు చెబుతున్నారు.జాతీయ రహదారిపైనే వివిధ వాహనాల్లో కలప తరలిపోతున్న అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు తెలిపారు.